UP Assembly Elections: యూపీలో పొత్తులపై భాజపా కీలక ప్రకటన

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని......

Published : 24 Sep 2021 16:34 IST

నిషద్‌, అప్నాదళ్‌తో కలిసి ఎన్నికల బరిలోకి.. ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటన

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల భాజపా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌, నిషద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషద్‌లు లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ కలిసే పోటీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘నిషద్‌ పార్టీతో కలిసి మేం ఎన్నికలకు వెళ్తున్నాం. భాజపా, నిషద్‌ పార్టీ కలిసి 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఉమ్మడి శక్తితో కలిసి బరిలోకి దిగుతాయి’’ అన్నారు.

సీట్ల పంపకంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తగిన సమయంలో దీనిపై ప్రకటిస్తామన్నారు. కేవలం నిషద్‌ పార్టీయే కాకుండా ఇప్పటికే పొత్తులో ఉన్న అప్నాదళ్‌తో కూడా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు తాము కలిసి పనిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోనే వెళ్తున్నామన్నారు. ఈ ఇద్దరు నేతలపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని.. ప్రజాస్వామ్యంలో విశ్వాసమే ఎంతో ముఖ్యమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని