Telangana News: కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్టు: జేపీ నడ్డా

భాజపా సర్కార్‌ బాధ్యతాయుతమైనదని.. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం లభించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Updated : 05 May 2022 21:57 IST

మహబూబ్‌నగర్‌: భాజపా సర్కార్‌ బాధ్యతాయుతమైనదని.. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం లభించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. మోదీ సర్కార్‌ 130 కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు అందిస్తోందని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలకు కూడా సాధ్యం కానిది మోదీ సర్కార్‌ చేసి చూపించారని కొనియాడారు. భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘జనం గోస - బీజేపీ భరోసా’ సభలో జేపీ నడ్డా మాట్లాడారు.

‘‘మోదీ సర్కార్‌ రెండేళ్ల పాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్‌ అందజేసింది. దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్‌ పథకంపై దేశమంతా సంతోషంగా ఉంది. అయితే ఈ పథకంలో చేరేందుకు కేసీఆర్‌ మాత్రం నిరాకరించారు. సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ సర్కారు భ్రష్టు పట్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం వలే మారింది. కేసీఆర్‌ పాలనలో ఒక్క ఇంచు భూమికి కూడా కొత్తగా నీరు అందలేదు. అవినీతిలో తెలంగాణ సర్కార్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో భారీగా అవినీతి జరిగింది. కేసీఆర్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రజాకర్‌ సమితి. కేసీఆర్‌ 8 ఏళ్లలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారు. ఇళ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులు కూడా కేసీఆర్ వినియోగించుకోలేకపోయారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉంది’’ అని నడ్డా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని