Botsa Sathyanarayana: అమరావతి రైతుల పాదయాత్రను ఎలా ఆపగలమో చూస్తారా?: బొత్స

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన

Published : 27 Sep 2022 01:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. కన్నెర్రజేస్తే యాత్రలు ఆగిపోతాయని.. తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్రను ఆపుతామన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 

‘‘మరో ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోవాలా? గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను మేము అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతుంది అమరావతి రైతుల పాదయాత్ర కాదు.. రియల్ ఎస్టేట్ యాత్ర. అమరావతి నిర్మాణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. రెండు మూడు ప్రసార మాధ్యమాలు నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి. అటువంటి వాటికి నేను భయపడను. పోలవరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులది త్యాగం. అమరావతి రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుంది? అమరావతి రైతులు భూములు ఇచ్పి ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు పొందారు. అమరావతి రైతుల పాదయాత్రను ఎలా ఆపగలమో చూస్తారా?యాత్రను ఎలా అపగలమో ముందే అన్నీ మీకు చెప్పి చెయాల్సిన అవసరం లేద’’ అని బొత్స వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని