BRS: 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు: కేటీఆర్‌

జనవరి 27 నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

Published : 25 Jan 2024 19:29 IST

హైదరాబాద్: జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించనున్నామని.. ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయి సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలోని అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తామన్నారు.

సమావేశాల నిర్వహణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తీసుకుంటారని చెప్పారు. ఈనెల 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో సమావేశాలుంటాయన్నారు. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని