మహిళా పోలీసుల దుస్తులు లాగడాన్ని ఎలా సమర్థించుకుంటారు?: చంద్రబాబు

అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.

Updated : 10 Aug 2023 11:53 IST

అమరావతి: అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ఖండించారు. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఏపీలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దాడిలో వైకాపా కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేరస్థుడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు.

సెబ్‌ స్టేషన్‌లో వైకాపా కార్పొరేటర్‌ వీరంగం

పోలీసులకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?: నారా లోకేశ్‌

ఎస్ఐ కుర్చీలో కూర్చుని.. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని వదిలి పెట్టాలంటూ పోలీసులపై దుర్భాషలాడటం వైకాపా నేతల సైకోయిజానికి పరాకాష్ఠ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) తీవ్రంగా మండిపడ్డారు. ‘‘జగన్ పాలనలో మహిళా పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? మహిళా పోలీసు డ్రెస్ పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లి, అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను చితకబాదిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరుడు, వైకాపా నేత సాకే చంద్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలి’’ అని లోకేశ్‌ డిమాండ్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని