రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా

Updated : 11 Jun 2021 17:51 IST

దిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా టికెట్‌పై నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు  పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా చీఫ్ విప్‌ మార్గాని భరత్‌ ఫిర్యాదు చేశారు.

అనంతరం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ... రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించామన్నారు. అనేక పర్యాయాలు అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌ క్వాలిఫై చేయాలని ఇవాళ మరోసారి స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని భరత్‌ మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని