34 మందితో తమిళనాడు మంత్రివర్గం

తాజా ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ  నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల  విజయం సాధించిన డీఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు...

Published : 06 May 2021 20:07 IST

ప్రకటన విడుదల చేసిన డీఎంకే

చెన్నై: తమిళనాడు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ  నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల  విజయం సాధించిన డీఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే గురువారం ప్రకటన విడుదల చేసింది.  వీరంతా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. హోంశాఖతో పాటు సంక్షేమశాఖ, జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ తదితర పోర్టుఫోలియోలను స్టాలిన్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల నియామకాలు, బదిలీలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. మరోవైపు స్టాలిన్‌ తనయుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధికి మాత్రం తాజా మంత్రుల జాబితాలో స్థానం దక్కలేదు. అయితే భవిష్యత్‌లో మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? ఇదే మంత్రులు ఉంటారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని