Andhra News: మూడు రాజధానులను జగన్‌ వదిలేసినట్లే కనిపిస్తోంది: జేసీ దివాకర్‌రెడ్డి

ఒకేసారి 91వేల ఉద్యోగాల ప్రకటన చరిత్రలో మొదటిసారని ఏపీకి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు.

Updated : 09 Mar 2022 15:26 IST

హైదరాబాద్‌: ఒకేసారి 91వేల ఉద్యోగాల ప్రకటన చరిత్రలో మొదటిసారని ఏపీకి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు యూత్‌లో మంచి క్రేజ్‌ వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఏపీలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స ప్రకటన బట్టి చూస్తే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్‌ వదిలేసినట్లే కనిపిస్తోందన్నారు. అందుకే బొత్స హైదరాబాద్‌ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా వీలు కాలేదని.. అపాయింట్‌మెంట్‌ ఓకే అయితే పిలుస్తామని చెప్పారని తెలిపారు. సీఎంలను కలిసేందుకు పరిస్థితి ఒకప్పటిలా లేదని దివాకర్‌రెడ్డి అన్నారు. ఏపీలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఉండటం లేదని జేసీ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని