Aroori Ramesh: భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు.

Updated : 17 Mar 2024 12:22 IST

హైదరాబాద్‌: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. భారాస వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్‌.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. భారాసను వీడనున్నారనే ప్రచారం తర్వాత ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముఖ్యనేతలు ఆయన్ను బుజ్జగించారు. అధినేత కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లి సముదాయించినా ఫలితం లేకపోయింది. అరూరి రమేశ్‌ భాజపా తరఫున వరంగల్‌ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశముంది. ఈ మేరకు ఆ పార్టీ నుంచి ఆయనకు హామీ లభించినట్లు సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని