శ్రమను తగ్గిస్తాయివి

ఒక్కోపనికి ఒక్కో పరికరాన్ని వాడే రోజులు పోయాయి. ఇప్పుడు మల్టీపర్పస్‌ పరికరాలదే హవా. అలానే, వంటను సులువుగా, తేలికైన మార్గాల్లో చేసే పరికరాలూ అందుబాటులోకి వస్తున్నాయి.

Published : 01 May 2024 02:10 IST

ఒక్కోపనికి ఒక్కో పరికరాన్ని వాడే రోజులు పోయాయి. ఇప్పుడు మల్టీపర్పస్‌ పరికరాలదే హవా. అలానే, వంటను సులువుగా, తేలికైన మార్గాల్లో చేసే పరికరాలూ అందుబాటులోకి వస్తున్నాయి. అవేంటో చూసేయండి మరి!


గిన్నెలకీ హ్యాండిల్‌...

వంట వేగంగా అయిపోవాలన్నా, వేపుళ్లలాంటి కూరల్ని మాడకుండా చేయాలన్నా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. అలాంటప్పుడు వాటి హ్యాండిల్‌ గట్టిగా ఉండాలి. అయితే కొన్ని రకాల గిన్నెలు, పాన్‌లు, కేక్‌ మౌల్డ్స్‌ లాంటి వాటికి హ్యాండిళ్లు రావు. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి కదా! అందుకు ఉపయోగపడేదే ఈ ‘రిమూవబుల్‌ పాన్‌ హ్యాండిల్‌’.

కావాల్సినప్పుడు దీనికి ఉండే నాబ్‌ని తిప్పి, బటన్‌ ఒత్తితే సరి. అందులో నుంచి గ్రిప్పర్‌ బయటకు వస్తుంది. దాన్ని గిన్నెకు ఆనించి, నాబ్‌ని వెనక్కు తిప్పితే సరి. గట్టిగా బిగుసుకుంటుంది. వేడిని తట్టుకునే విధంగా దీన్లో ఎయిర్‌ కూలింగ్‌ డిజైన్‌ ఉంటుంది కాబట్టి చేయి కాలకుండానూ ఉంటుంది.


అంచుల్లోనూ శుభ్రంగా...

సాధారణంగా పాలడబ్బా, బాటిళ్లు... వంటి వాటిని కడగాలంటే బ్రష్‌లాంటివి ఉపయోగిస్తాం. అయితే డిజైన్‌ డబ్బాలు, బాటిళ్లు లాంటివి ఆ బ్రష్‌లతో సరిగా శుభ్రపడవు. అందుకే ఈ ‘త్రీ ఇన్‌ వన్‌ మల్టీపర్పస్‌ క్లీనింగ్‌ బ్రష్‌ను తెచ్చుకోండి. దీంతో బాటిల్‌ మూతలూ, పీలర్లు, తురిమే పరికరాలనూ తేలిగ్గా శుభ్రపరచుకోవచ్చు. దీన్లో ఉండే మూడు రకాల బ్రష్‌లు... బాటిల్‌ పైభాగంలో, లోతుగా మూలల్లోనూ శుభ్రం చేయడానికి సాయపడతాయి.


రెండూ ఒకేదాంట్లో...

సాధారణంగా మనం పీలర్‌, చాకు రెండింటినీ వేర్వేరుగా కొంటుంటాం కదా! అలాకాకుండా ‘టూఇన్‌ వన్‌ పోర్టబుల్‌ పీలర్‌ నైఫ్‌’ను తెచ్చుకోండి. దీనికి ఉండే బటన్‌ నొక్కితే మూత తెరచుకుంటుంది. ఇందులోనే ఓవైపు పీలర్‌ బ్లేడ్‌, మరోవైపు కటింగ్‌ బ్లేడ్‌ ఉంటాయి. పండ్లు, కూరగాయలు ఒకేదాంతో ఈజీగా కట్‌ చేసుకోవచ్చు.

అంతేకాదు, మామూలు కత్తి అయితే చేతులకు గుచ్చుకుంటుందన్న భయం ఉంటుంది. దీన్ని అయితే మూత పెట్టుకుని ఎంచక్కా బ్యాగులో పెట్టుకుని మనతో పాటు తీసుకెళ్లొచ్చు కూడా!


అల్లం తొక్క తీయాలంటే...

అల్లం పైతొక్క తీయాలంటే చాకుని ఉపయోగిస్తాం. కానీ దాంతో ఒక్కోసారి తొక్కతో పాటు అల్లం కూడా కట్‌ అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఈ ‘జింజర్‌ పీలర్‌’ను తెచ్చుకోండి. దీన్ని వేలికి అలా తగిలించుకుని అల్లం తొక్క తీసేయొచ్చు. ఇందులోని బొడిపెల లాంటి నిర్మాణం తొక్కను తేలిగ్గా తీసేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్