కాంగ్రెస్‌ పార్టీ నుంచి రమేష్‌ రాథోడ్‌ సస్పెండ్‌ 

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత రమేష్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 28 Feb 2021 00:50 IST

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత రమేష్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా నాయకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం రమేష్‌ రాథోడ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కోదండరెడ్డి పేర్కొన్నారు. రమేష్‌ రాథోడ్‌ 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని