
Uttarakhand polls: భాజపాలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు
దిల్లీ: ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు, విశ్రాంత కర్నల్ విజయ్ రావత్ భాజపాలో చేరారు. మరికొద్ది వారాల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ బుధవారం ఆయన దిల్లీకి వెళ్లి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామితో పాటు పలువురు భాజపా నేతల సమక్షంలో కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. భాజపాలో చేరే అవకాశం కల్పించినందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత తన తండ్రి కూడా భాజపాతో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఎంతో ప్రత్యేకమైందనీ.. ఆయన చేసే పనులన్నీ దేశ ప్రగతి కోసమేనన్నారు. అదే తనను భాజపాలో చేరేందుకు ప్రోత్సహించిందని చెప్పారు. భాజపా పనితీరును అంతా మెచ్చుకొంటున్నారని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.