కేకేతో ఎలా ఓటు వేయిస్తారు?:లక్ష్మణ్‌

పురపాలిక ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా...

Published : 30 Jan 2020 20:55 IST

హైదరాబాద్: పురపాలిక ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన లక్ష్మణ్‌ రాజ్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి రాష్ట్రంలో రాజకీయాలంటేనే అసహ్యించుకునే రీతిలో తయారు చేశారని విమర్శించారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో భాజపాకు స్పష్టమైన మోజారిటీ ఉన్నప్పటికీ ఎక్స్‌ అఫీషియో సభ్యులతో ఓటింగ్‌ వేయించి ఛైర్మన్‌ పదవి దక్కకుండా తెరాస అక్రమాలకు పాల్పడిందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలంగాణలో ఎలా ఓటు వేస్తారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తుక్కుగూడలో తెరాస వ్యవహరించిన తీరు.. పురపాలక ఎన్నికల్లో అధికార దుర్వినియోగంపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు లక్ష్మణ్‌ వివరించారు. ఫిబ్రవరి 1వ తేదిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి కేశవరావుపై ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని