నేడు దిల్లీకి సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే

Updated : 12 Feb 2020 00:07 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులపైనా ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లే వీలుంది. అనంతరం కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది కేంద్రమంత్రులతోనూ జగన్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీకి వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని