‘వారిని కలిసే వరకూ దీక్ష కొనసాగిస్తా’

భాజపా చెరలో ఉన్న మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేలను కలవనిచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తానని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘బెంగళూరు పోలీసులు మమ్మల్ని స్థానిక డీసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు.

Published : 18 Mar 2020 13:46 IST

బెంగళూరు: భాజపా చెరలో ఉన్న మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేలను కలిసేంత వరకూ తన దీక్ష కొనసాగిస్తానని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘బెంగళూరు పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి స్థానిక డీసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రమదా హోటల్‌లో భాజపా చెరలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా కలుస్తాం. వారిని కలవడానికి అనుమతి ఇచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. నియంతృత్వంలో కాదు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

బుధవారం తెల్లవారుజామున కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బెంగళూరుకు చేరుకోవడంతోనే హైడ్రామా మొదలైంది. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఉన్న రమదా హోటల్‌కు వెళ్లి వారిని కలిసేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి..
కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అరెస్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని