లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు మద్యం నిషేధించాలి

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసేంత వరకు మద్యపాన నిషేధం కొనసాగాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒకవైపు వైద్యులు మద్యపానం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గుతుందని చెబుతుంటే.. పాక్షిక సడలింపుల పేరుతో మద్యపానం విక్రయాలకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతివ్వడం దివాళా

Published : 03 May 2020 01:21 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసేంత వరకు మద్యపాన నిషేధం కొనసాగాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒకవైపు వైద్యులు మద్యపానం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గుతుందని చెబుతుంటే.. పాక్షిక సడలింపుల పేరుతో మద్యపానం విక్రయాలకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతివ్వడం దివాళా కోరుతనమేనని నారాయణ మండిపడ్డారు. మద్యం ఆర్థిక వనరుగా పరిగణించడం అనైతికమన్నారు. బిహార్‌లో మద్యపాన నిషేధం ఎప్పటి నుంచో అమలు చేస్తోందని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో తాగుబోతుల కేసులు తగ్గాయని, వాహన ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలో పుర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసేంత వరకు మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని