నడ్డా..ప్రధానిని ఆ వివరాలు అడుగుతారా..?

భారత్‌, చైనా సరిహద్దుల ఉద్రిక్తతలపై భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతవారం గల్వాన్‌ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే...

Published : 23 Jun 2020 13:14 IST

భాజపా అధ్యక్షుడికి చిదంబరం సూటి ప్రశ్న

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, చైనా సరిహద్దుల ఉద్రిక్తతలపై భాజపా, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతవారం గల్వాన్‌ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఇటీవల తీవ్రంగా స్పందించగా సోమవారం ఆయనను విమర్శిస్తూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎదురుదాడి చేశారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న కాలంలో 2010 నుంచి 2013 వరకు ఇరు దేశాల సరిహద్దుల్లో 600 సార్లు సైనికుల మధ్య దాడులు జరిగాయని.. వాటికి వివరణ ఇవ్వాలని కోరారు. 

ఈ ప్రకటనకు స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మంగళవారం వరుస ట్వీట్లు చేశారు. ‘భారత్‌-చైనా సరిహద్దుల్లో 2010 నుంచి 2013 వరకు 600 దాడులు జరిగాయని, వాటికి వివరణ ఇవ్వాలని జేపీ నడ్డా అడిగారు. అవును.. నిజమే అవన్నీ జరిగాయి. కానీ, ఎక్కడా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు. ఆ దాడుల్లో ఎప్పుడూ మన సైనికులు ప్రాణాలు కోల్పోలేదు. అలాగే 2015 నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల సరిహద్దుల్లో 2,264 దాడులు జరిగాయి, మరి వీటికి సంబంధించిన వివరాలను ప్రస్తుత ప్రధానిని నడ్డా అడుగుతారా..?’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని