కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటి?

సీఎం కేసీఆర్‌కు కొండపోచ్చమ్మ కాల్వకు సంబంధం ఏంటని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన తమ ప్రభుత్వం ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు...

Published : 03 Jul 2020 18:43 IST

ప్రతి పక్షాలకు ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన తమ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు తగవని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలని సూచించారు. వర్షాకాలం చెరువులకు గండ్లు పడటం, వాటిని పూడ్చడం సహజమేనని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌, భాజపాకు నచ్చడం లేదని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ సైతం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని