AP Cabinet: ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. కొలువుదీరిన కొత్త కేబినెట్‌

ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఏర్పాటు

Updated : 11 Apr 2022 16:19 IST

అమరావతి: ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రులు ప్రమాణం చేస్తున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.

అనంతరం అంజాద్‌ బాషా (కడప), ఆదిమూలపు సురేశ్‌ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల)తో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), దాడిశెట్టి రాజా (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్‌నాథ్‌ (అనకాపల్లి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

గుమ్మనూరు జయరామ్‌ (ఆలూరు), జోగి రమేశ్‌ (పెడన), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), ఉష శ్రీచరణ్‌ (కల్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపె విశ్వరూప్‌ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), సీదిరి అప్పలరాజు (పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట) మంత్రులుగా ప్రమాణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని