‘హాథ్‌సే హాథ్‌ జోడో’ ఇన్‌ఛార్జుల నియామకం

జనవరి 26 నుంచి ప్రారంభం కానున్న ‘హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌’ పాదయాత్రకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించింది.

Updated : 25 Jan 2023 06:24 IST

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: జనవరి 26 నుంచి ప్రారంభం కానున్న ‘హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌’ పాదయాత్రకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం ఈ మేరకు జాబితా విడుదల చేశారు. పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులతో కలిపి కార్యనిర్వాహక అధ్యక్షులు ఒక్కొక్కరికి మూడు, నాలుగు నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. మహ్మద్‌ అజారుద్దీన్‌ను ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజవర్గాలకు ఇన్‌ఛార్జిగా నియమించారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌ను కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌లకు, బి.మహేష్‌కుమార్‌గౌడ్‌ను మెదక్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లకు, జగ్గారెడ్డిని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మంలకు, గీతారెడ్డిని నాగర్‌కర్నూల్‌, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని