భారాసలో చేరనున్న ఒడిశా మాజీ సీఎం!

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, కొరాపుట్‌ మాజీ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌, ఆయన తనయుడు శిశిర్‌ గమాంగ్‌లు భాజపాను వీడుతున్నట్లు బుధవారం భువనేశ్వర్‌లో వెల్లడించారు.

Published : 26 Jan 2023 05:03 IST

భాజపాకు రాజీనామా చేసిన గిరిధర్‌ గమాంగ్‌

రాయగడ పట్టణం, సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, కొరాపుట్‌ మాజీ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌, ఆయన తనయుడు శిశిర్‌ గమాంగ్‌లు భాజపాను వీడుతున్నట్లు బుధవారం భువనేశ్వర్‌లో వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఇటీవల వీరు హైదరాబాద్‌లో భారత్‌ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను కలిశారు. తండ్రీకుమారులు భారాసలో చేరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గిరిధర్‌ మాట్లాడుతూ... ‘అవమానభారంతో భాజపాను వీడుతున్నా. స్వచ్ఛందంగా భాజపాలో చేరి, పార్టీ బలోపేతానికి కృషి చేశా. దూషణ, దుష్ప్రవర్తనను కొంతవరకు సహించగలం. అవమానాన్ని భరించడం కష్టం. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపాం. త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరనున్నాం’ అని పేర్కొన్నారు. గిరిధర్‌ కొరాపుట్‌ నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

*  భారాసలో చేరనున్నట్లు కొరాపుట్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జయరామ్‌ పంగి ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు