దేశంలో ఆంగ్లేయుల కాలం నాటి పరిస్థితులు
దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తే కొందరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.
భాజపా.. కేసీఆర్ ఒక్కటే అని ఈటల మాటల్లో స్పష్టమైంది: రేవంత్
ఈనాడు, హైదరాబాద్: దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తే కొందరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన అనేక హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. దేశంలో ఆంగ్లేయుల కాలం నాటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, పవన్ ఖేరా, అంజన్‌కుమార్, మల్లు రవి తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తర్వాత విలేకరులతోనూ ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ‘‘ప్రధాని మోదీ ప్రజారంగ సంస్థలను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. తొమ్మిది ప్రభుత్వాలను భాజపా కూలదోసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దుచేయాలి. అవసరమైతే ఉరి తీసే విధానాన్ని, హత్యలు, అత్యాచారాలకు వేసే కఠిన శిక్షలను అమలు చేయాలి. భాజపాలోనూ కేసీఆర్‌కు కోవర్టులున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీలోకి వెళ్లాక అర్థమైంది. భాజపా.. కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల మాటల్లో స్పష్టమైంది. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి భాజపాలో చేరినవారు సంతృప్తిగా లేరు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భట్టి మాట్లాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తాం. ఎమ్మెల్యేగా పోటీచేయడానికి వయసు 25 ఏళ్ల నుంచి 21కి తగ్గిస్తాం’’ అని రేవంత్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్