కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి
కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ప్రధానికి ఆర్.కృష్ణయ్య లేఖ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో 52 శాతానికి పైగా బీసీలున్నా.. ఈ దామాషాకు అనుగుణంగా నిధుల కేటాయింపు లేదని పేర్కొన్నారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అతి తక్కువ కేటాయింపుల వల్ల దేశవ్యాప్తంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకూ ఉపకార వేతనాల పథకాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రాల్లో నిర్మించే వసతిగృహాలు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాల కోసం కేంద్రం నిధులివ్వాలని, జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను బీసీలకు సైతం అమలు చేసేందుకు ప్రధాని చొరవ తీసుకోవాలని కృష్ణయ్య అభ్యర్థించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?
-
General News
Tamilisai soundararajan: శ్రీరాముడి పట్టాభిషేకానికి రైలులో భద్రాచలానికి బయలుదేరిన గవర్నర్