నేడు షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పునఃప్రారంభం కానుంది. 

Updated : 02 Feb 2023 05:09 IST

మధ్యాహ్నం గవర్నర్‌తో భేటీ అనంతరం నర్సంపేటకు పయనం

ఈనాడు, హైదరాబాద్‌: వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పునఃప్రారంభం కానుంది.  మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో రాజ్‌భవన్‌లో భేటీ అవుతారు. అనంతరం షర్మిల నర్సంపేటకు పయనమై ఆ నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా నుంచి పాదయాత్రను తిరిగి మొదలు పెడతారని పార్టీ వర్గాలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. తొలిరోజు లింగగిరి, నెక్కొండ మండలం తోపనగడ్డతండా, నెక్కొండ మీదుగా 224వ రోజు ప్రజా ప్రస్థానం సాగుతుందని పేర్కొన్నాయి. సాయంత్రం 5.30 గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు