చంద్రబాబు వస్తే... మొదట వాలంటీర్ల మీదే తుపాకీ పేలుద్ది: మంత్రి ధర్మాన

‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో... ఏ పార్టీ మంచిదో... చెప్పకూడదని ఎవరన్నారు. ప్రతి పౌరునికి హక్కుంది. వాలంటీరు కూడా ఒక పౌరుడే. మీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే, ప్రచారం చేసే అవకాశంతోపాటు మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కుంది.

Updated : 07 Feb 2023 07:41 IST

గార, న్యూస్‌టుడే: ‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో... ఏ పార్టీ మంచిదో... చెప్పకూడదని ఎవరన్నారు. ప్రతి పౌరునికి హక్కుంది. వాలంటీరు కూడా ఒక పౌరుడే. మీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే, ప్రచారం చేసే అవకాశంతోపాటు మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కుంది. మీరు వట్టినే భయపడిపోకూడదు. మీ పరిధిలోని 50 కుటుంబాలపై దృష్టి పెట్టండి. వారందరికీ సౌకర్యవంతమైన జీవనం లభించడానికి కారణం ఏమిటన్నది వివరించాలి. ఒక్క కుటుంబాన్నయినా మార్చండి. పోనీ, చంద్రబాబు వచ్చాడనుకోండి... మొట్టమొదటి ఫైరింగ్‌ ఎవరిమీద అవుతుంది. ముందు తుపాకీ పేలేది మీ మీదే. ఆయన పేల్చడం ఎందుకు... మనమే ముందు పేల్చేస్తే సరికదా. తుపాకీ మన దగ్గర ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ పంచాయతీలో సోమవారం జరిగిన ‘గడప.. గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని