ప్రతిపక్షాలతో కలిసి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో కలిసి పోరాడి వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

Published : 24 Mar 2023 04:18 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో కలిసి పోరాడి వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు జెల్లి విల్సన్‌, అక్కినేని వనజతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో వైకాపా పరిస్థితేమిటో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసిపోయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తే అక్కడా అవే ఫలితాలు వచ్చేవి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయం. పులివెందులలోనూ జగన్‌ ఓడిపోతారు. కడపకు చెందిన ఐదారుగురి బృందంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులకు అధికారాలు లేవు. పదవులు అందరికి ఇచ్చి, అధికారం ఆ బృందం వద్దే ఉంచుకున్నారు’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని