అమరవీరుల విగ్రహాలను ఏర్పాటుచేయాలి

అమరవీరులైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 05:43 IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

ఈనాడు, అమరావతి: అమరవీరులైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీచేశారు. ‘వీరి పోరాట స్ఫూర్తిని యువతకు తెలియజేసేలా స్మారక స్తూపాలను నెలకొల్పాలి’ అని పేర్కొన్నారు.

ముగ్గురి మృతి బాధాకరం

విశాఖలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయి, ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ‘పాత భవనాలతో అనునిత్యం ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. ఇటువంటి భవనాల తొలగింపు అధికారులకు ఎంతటి కష్టమో తెలుసుకోగలను. కేవలం నోటీసులు ఇచ్చి.. ఊరుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా యజమానులకు ఉదారంగా సాయపడాలి’ అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు