‘రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Mar 2023 04:25 IST

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రాత్రి విజయవాడ నగరం లెనిన్‌ కూడలిలో కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీని సస్పెండ్‌ చేసిన రోజునే క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు