ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై అధ్యయనం

రాష్ట్రంలో 2014 నుంచి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు ప్రశ్నపత్రాల లీకేజీపై ఏర్పాటైన భాజపా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రకటించింది.

Published : 28 Mar 2023 04:34 IST

భాజపా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2014 నుంచి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు ప్రశ్నపత్రాల లీకేజీపై ఏర్పాటైన భాజపా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ సహా రాష్ట్రంలో ఇతర ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి న్యాయపోరాటం చేయాలని సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్‌.విఠల్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమైంది. సభ్యులు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కృష్ణప్రసాద్‌, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు కరుణాగోపాల్‌ పాల్గొన్నారు. సింగరేణి కొలువుల్లో అక్రమాలు జరిగాయనే అంశంపై అక్కడ పర్యటించి సమాచారం సేకరించనున్నట్లు కమిటీ తెలిపింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో పర్యటించి ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని