తెదేపా నాయకులపై బలవంతంగా తప్పుడు కేసులు పెట్టించారు

వైకాపా నాయకులు నన్ను బలవంతం చేసి తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త దామోదర్‌రెడ్డి మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 28 Mar 2023 05:05 IST

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వైకాపా కార్యకర్త ఆడియో

ఏర్పేడు, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు నన్ను బలవంతం చేసి తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త దామోదర్‌రెడ్డి మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏర్పేడు జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దామోదర్‌రెడ్డి, మరో వ్యక్తి ఫిర్యాదుతో తెదేపా నేతలపై ఏర్పేడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ, దాడి కేసులు నమోదు చేశారు. దీంతో తెదేపా నేతలు రహస్య ప్రాంతాల్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో దామోదర్‌రెడ్డి ఓ తెదేపా నాయకుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ‘నా చొక్కా చించుకుని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైకాపా నేతలు నటించమన్నారు. వారు చెప్పినట్లుగానే చేశా. చేసిన తప్పుకు బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. అనవసరంగా తప్పుడు కేసులు పెట్టించామని మా కుటుంబమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది’ అంటూ సుమారు ఐదు నిమిషాలకు పైగా ఆయన మాట్లాడిన ఆడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు