అభివృద్ధి లేక కునారిల్లుతున్న రాష్ట్రం

అభివృద్ధి లేక రాష్ట్రం కునారిల్లుతోందని.. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోందని భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 22 May 2023 04:34 IST

భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌
గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం

ఈనాడు-అమరావతి: అభివృద్ధి లేక రాష్ట్రం కునారిల్లుతోందని.. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోందని భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రంలో రాజకీయాలు ముడిపడి ఉన్నాయని, అధికారం కోసమే వైకాపా పని చేస్తోందని విమర్శించారు. భారాస ఏపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన గుంటూరులో ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెదేపా, వైకాపా పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని.. ఇక తామే ప్రత్యామ్నాయమన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావట్లేదు.. రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. దేశంలో భారాస మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని