నూతన పార్లమెంట్‌ భవనం ‘పరివర్తన’కు నిలయం

భారత నూతన పార్లమెంట్‌ భవనం దేశ పరివర్తన విధానానికి, నిర్ణయం తీసుకునే శక్తికి నిలయంగా మారాలని తెదేపా అధినేత చంద్రబాబు అభిలషించారు.

Updated : 26 May 2023 06:48 IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : భారత నూతన పార్లమెంట్‌ భవనం దేశ పరివర్తన విధానానికి, నిర్ణయం తీసుకునే శక్తికి నిలయంగా మారాలని తెదేపా అధినేత చంద్రబాబు అభిలషించారు. దేశం గర్వించదగ్గ ఈ ఘట్టంలో తానూ భాగస్వామిగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం సహా ఈ చారిత్రక నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గురువారం ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దేలా పార్లమెంటులో నిర్ణయాలు జరగాలని ఆయన అభిలషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని