తూర్పు నుంచి సమరశంఖం
రానున్న ఎన్నికలకు సంబంధించి రాజమహేంద్రవరం నుంచే మరోసారి శంఖారావం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.
నేటి మహానాడు బహిరంగ సభకు శ్రేణుల సన్నద్ధం
ఈనాడు, రాజమహేంద్రవరం: రానున్న ఎన్నికలకు సంబంధించి రాజమహేంద్రవరం నుంచే మరోసారి శంఖారావం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ‘తూర్పు’ సెంటిమెంట్ ఆది నుంచీ కొనసాగుతోంది. గోదావరి జిల్లాల ప్రజలు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న నేపథ్యంలో అందరి దృష్టి ఇటు ఉంటుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, మహానాడు బహిరంగ సభను ఆదివారం నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత నెలకొన్న సంక్షోభ సమయంలో ఆయన ఇక్కడే తొలి బహిరంగ సభ నిర్వహించారు. 1993 నవంబరులో రాజమహేంద్రవరం కేంద్రంగా స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ‘ప్రజాగర్జన’ పేరిట సభ ఏర్పాటు చేశారు. ఈ వేదిక పైనుంచే అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి, యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధికి తెదేపా చేపట్టనున్న అంశాలను ప్రజలకు వివరించి సమర శంఖం పూరించనున్నారు.
రెండోసారి మహానాడు
2006లోనూ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో చంద్రబాబు అధ్యక్షతన మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పార్టీ ప్రతినిధులు, అభిమానులు తరలివచ్చారు. అప్పటికి తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
తీర్మానాలపై అందరి ఆశ
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ‘తూర్పు’ సెంటిమెంట్‌గా ఎన్టీఆర్‌కు ఇష్టమైన రాజమహేంద్రవరంలో ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే సుమారు 5 లక్షల మంది వస్తారని ప్రాథమిక అంచనా. ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాత కుంగిపోగా వారికి భరోసా ఇస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు అయిదు రోజుల పాటు పర్యటించి అండగా నిలిచారు. దీంతో రైతులు సైతం స్వచ్ఛందంగా సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు లేక ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్న యువత ఈ మహానాడులో తమ గురించి ఏ తీర్మానాలు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వేదికపై నుంచే వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక మేనిఫెస్టో విడుదల చేసి.. వైకాపా ప్రభుత్వంపై రణ భేరి మోగించి 2024లో విజయ ఢంకా మోగిస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ