దేశ మనోభావాలను అవమానించారు
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షం బహిష్కరించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిసారిగా తప్పుపట్టారు.
పార్లమెంటు ప్రారంభాన్ని విపక్షాలు బహిష్కరించడంపై ప్రధాని మోదీ
అజ్‌మేర్: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షం బహిష్కరించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిసారిగా తప్పుపట్టారు. తమ చర్య ద్వారా కాంగ్రెస్.. దేశ, పార్లమెంటు భవనాన్ని నిర్మించిన 60 వేల మంది కార్మికుల మనోభావాలను అవమానించింది. ‘‘మూడు రోజుల క్రితం మనదేశం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆవిష్కరించుకుంది. ఇది మీకు గర్వకారణమా? కాదా? దేశ గౌరవం ఇనుమడించడంపై ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారా? వీటిపైనా కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు రాజకీయ బురదను చల్లాయి’’ అని రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో జరిగిన భాజపా బహిరంగ ర్యాలీలో మోదీ విమర్శించారు. పార్లమెంటు భవనం ఆవిష్కరణ వంటి అవకాశాలు కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని..అయితే దీనిని కాంగ్రెస్ తన స్వార్థ నిరసన కోసం ఉపయోగించుకుంది అని మోదీ ఆక్షేపించారు. దేశం సాధిస్తున్న పురోగతిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. పేదవాడి కుమారుడినైన తాను కాంగ్రెస్ అవినీతిని, వారి కుటుంబ రాజకీయాలను ప్రశ్నిస్తున్నందున, వారి ఇష్టానుసారం వ్యవహరించకుండా అడ్డుకుంటున్నందుకు ఆ పార్టీ ఆగ్రహంతో ఉందని తెలిపారు. అంతకు ముందు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అజ్‌మేర్ జిల్లాలోని పుష్కర్‌లో గల ప్రసిద్ధ బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ