బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలి: సునీతారావు

మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు.

Published : 02 Jun 2023 03:49 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు. ఆమె గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు నెలలుగా మహిళా రెజ్లర్లు దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తుంటే మోదీ, అమిత్‌షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భేటీ పడావో.. భేటీ బచావో అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న భాజపా సర్కారుకు మహిళా రెజ్లర్ల ఆవేదన, న్యాయపోరాటం కనిపించడం లేదా అని నిలదీశారు. వారిని పోలీసులతో బలవంతంగా జంతర్‌ మంతర్‌ నుంచి తరలించిన రోజు ఓ బ్లాక్‌ డే అని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు