దేశంపై రాహుల్ విమర్శలకు జీడీపీ గణాంకాలే జవాబు: భాజపా
దేశ వృద్ధి ప్రస్థానంపై అపనమ్మకం కలిగించేలా నిరాశావాదంతో, ద్వేషంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 7.2% వార్షిక వృద్ధి గణాంకాలే ఆయనకు జవాబు అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
దిల్లీ: దేశ వృద్ధి ప్రస్థానంపై అపనమ్మకం కలిగించేలా నిరాశావాదంతో, ద్వేషంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 7.2% వార్షిక వృద్ధి గణాంకాలే ఆయనకు జవాబు అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం సాధిస్తున్న అభివృద్ధిపై విద్వేషం చిమ్మడమే రాహుల్ లక్ష్యమని ఆరోపించారు. దేశ ఆర్థిక వృద్ధిపై వివిధ నివేదికల అంచనాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీతో రాహుల్‌కు ఏమైనా ఇబ్బందులున్నా దేశ విజయాలను మాత్రం పండుగలా చూడాలే తప్పిస్తే విజయగాథల్ని కించపరిచి పైశాచిక ఆనందం పొందకూడదని కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు అన్నారు.
మోదీ మా హెడ్మాస్టర్: గిరిరాజ్‌సింగ్
మోదీ అంటే మేనేజ్‌మెంట్ గురువు అనీ, దేశంలో తేనెటీగల పెంపకం ద్వారా మకరందం ఉత్పత్తికి ఊతమిచ్చిన ఆద్యుడు ఆయనేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి- పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ పేర్కొన్నారు. శ్వేత విప్లవం, నీలి విప్లవం మాదిరిగా ఇది తీపి విప్లవమని అభివర్ణించారు. తామంతా విద్యార్థులమనీ, తమ ప్రధానోపాధ్యాయుడు మోదీ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vishal: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు ఎమర్జెన్సీ మీటింగ్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభం
-
Nitin Gadkari : హైడ్రోజన్ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ
-
Narayana: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!