రూ.లక్ష భిక్షం వద్దు.. బీసీ బంధు ప్రకటించాలి
రాష్ట్రంలో భారాస ప్రభుత్వం బీసీ కులవృత్తుల వారికి ఇవ్వనున్న రూ.లక్ష భిక్ష వద్దని.. బీసీబంధు ప్రకటించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
బీసీ సంఘాల నేతల డిమాండ్
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భారాస ప్రభుత్వం బీసీ కులవృత్తుల వారికి ఇవ్వనున్న రూ.లక్ష భిక్ష వద్దని.. బీసీబంధు ప్రకటించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ కులసంఘాల జేఏసీ ఛైర్మన్ కుందారం గణేశ్‌చారి అధ్యక్షతన బీసీ కుల సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇతర వర్గాలకు రూ.10 లక్షలు ఇచ్చి బీసీలకు భిక్షం వేసినట్టు రూ.లక్ష ప్రకటించారని, అదీ కొన్ని కులాలకే పరిమితం చేశారని వక్తలు దుయ్యబట్టారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... గతంలో బీసీలకు బీసీబంధు, సబ్ ప్లాన్, జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని, బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు, ప్రతి కుల ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, సంచార జాతుల ఫెడరేషన్‌కు 100 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అవేవీ అమలు చేయలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nellore: నెల్లూరులో ఉద్రికత్త.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!