పునర్విభజన హామీలు నెరవేర్చాలని కోరాం

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.

Published : 20 Jul 2023 04:56 IST

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సమావేశంలో కోరాం. పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరిస్తోంది. ఇటీవల రూ.12,911 కోట్లు మంజూరు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గాలని నివేదించాం’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని