ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకొని ఓటేద్దాం

ఓటుహక్కు ఉన్న అందరం ఎన్నికల ప్రక్రియలో పాల్గొందామని, ఓటు వేసే ముందు దేశంలో ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుని సరైన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేద్దామని మజ్లిస్‌ పార్టీ  అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ బుధవారం అన్నారు.

Published : 18 Apr 2024 04:05 IST

అసదుద్దీన్‌ ఒవైసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఓటుహక్కు ఉన్న అందరం ఎన్నికల ప్రక్రియలో పాల్గొందామని, ఓటు వేసే ముందు దేశంలో ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుని సరైన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేద్దామని మజ్లిస్‌ పార్టీ  అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ బుధవారం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌ శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు.  ఐదేళ్లలో చాలా ఘటనలకు మనం సాక్షులుగా నిలిచామని, కొవిడ్‌-19 రెండు వేవ్‌ల కారణంగా 5-10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలు నదుల్లో తేలియాడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. వలస కూలీలు కొందరు సొంత గ్రామాలకు నడుచుకుంటూ వెళ్తూ.. మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఐదేళ్లలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, విద్వేషం తారస్థాయికి చేరుకుందని విమర్శించారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థికవ్యవస్థగా మారుతున్నామంటూ గొప్పలు చెబుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల తలసరి ఆదాయం గురించి ఆలోచించాలని హితవు పలికారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాల కారణంగా రాజ్యాంగానికే ముప్పు ఏర్పడుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు