భాజపాలో చేరుతున్నా: కొండా

కొంతకాలంగా భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో

Published : 01 Jul 2022 05:44 IST

పార్టీ ఉనికి కోల్పోయాక రేవంత్‌కు పీసీసీ పదవి

సకాలంలో ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌లో ఉండేవాడిని

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: కొంతకాలంగా భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరతానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌పై విశ్వాసం పోయిందని, తెరాసను ఎదుర్కోవాలంటే భాజపాతోనే సాధ్యమని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నాటి ఉద్యమకారులను కేసీఆర్‌ పూర్తిగా పక్కన పెట్టారని, ఉద్యమాన్ని వ్యతిరేకించిన పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని  సబిత వంటి వారు ఇప్పుడు తెరాసలో ఉన్నారని మండిపడ్డారు. 75 శాతం మందిలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని, ఎనిమిదేళ్ల కాలంలో రూ. 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తాను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్‌ పూర్తిగా ఉనికి కోల్పోయిన తర్వాత ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారని, సకాలంలో ఇచ్చి ఉంటే తాను కాంగ్రెస్‌లోనే ఉండేవాడిని అని చెప్పారు. ఎంపీ స్థానంపైనే ఆసక్తి ఉందని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భాజపా ఒత్తిడి చేస్తే ఒప్పుకొంటానన్నారు. ¸

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని