విజయ సంకల్పసభ వేదికపై 40 మంది

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భాజపా రాష్ట్ర పార్టీ విజయ సంకల్ప సభ నిర్వహించనుంది. పరేడ్‌గ్రౌండ్‌లో సాయంత్రం 6 గంటలకు....

Published : 03 Jul 2022 05:35 IST

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భాజపా రాష్ట్ర పార్టీ విజయ సంకల్ప సభ నిర్వహించనుంది. పరేడ్‌గ్రౌండ్‌లో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభావేదికపై ప్రధాని మోదీతో పాటు 40 మంది ముఖ్యనేతలు ఆసీనులు కానున్నారు. ప్రధానికి ఒకవైపు నడ్డా, మరోవైపు బండి సంజయ్‌ ఉంటారు. కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, రాజ్‌నాథ్‌సిగ్‌, కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీ, హరియాణా, అస్సాం, కర్ణాటక, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.ఎల్‌.ఖట్టర్‌, హిమంత బిశ్వ శర్మ, బసవరాజ్‌ బొమ్మై, ప్రమోద్‌ సావంత్‌, జయరామ్‌ ఠాకూర్‌, పుష్కర్‌ సింగ్‌ ధామి, సీఎం మాణిక్‌ సాహా, పేమా ఖండు, బీరేన్‌సింగ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, ఎంపీలు డి.అర్వింద్‌, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, నేతలు డీకేఅరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌రావు, గరికపాటి మోహన్‌రావు తదితరులు వేదికపై ఆసీనులవుతారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 103 మంది కూర్చునేలా మరో వేదిక, కుడివైపున 70-80 మందితో ఇంకో వేదికను ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని