Revanth Reddy: చదువుకునేందుకు పుస్తకం లేదు.. చదువు చెప్పే గురువులు లేరు..

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైలం బిడ్డో.. అని తల్లిదండ్రులు భయంతో పిల్లలను ప్రభుత్వ బడికి పంపే దుస్థితి నెలకొన్నదన్నారు.

Updated : 09 Aug 2022 06:24 IST

ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైలం బిడ్డో.. అని తల్లిదండ్రులు భయంతో పిల్లలను ప్రభుత్వ బడికి పంపే దుస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటులో తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ‘చదువుకొనే చోటు లేదు.. చదువుకునేందుకు పుస్తకం లేదు.. చదువు చెప్పే గురువులు లేరు.. బడుల్లో మౌలిక వసతులు లేవు..పసి పిల్లల ప్రాణాలకు భరోసా లేదు..ఈ ఉద్యమ ద్రోహి పాలనలో’ అని ధ్వజమెత్తారు. అచ్చంపేట నియోజకవర్గం తాగపూర్‌ ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వీడియో రూపంలో ట్విటర్‌లో షేర్‌ చేశారు. కామన్వెల్త్‌ మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

* కాంగ్రెస్‌లో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. బీసీలంతా ఐక్యంగా పని చేసి మునుగోడు సీటు గెలిచి కాంగ్రెస్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. పీసీసీ ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ అధ్యక్షతన సోమవారం గాంధీభవన్‌ ప్రకాశం హాలులో ‘ఓబీసీ శక్తి సమ్మేళనం’ జరిగింది. వివిధ జిల్లాల నుంచి ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని