ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్‌ సభ

మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతలో భాగంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ, జనసమీకరణ బాధ్యతలను సీఎం కేసీఆర్‌ పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి

Updated : 15 Aug 2022 06:38 IST

మంత్రి, ప్రజాప్రతినిధులకు మునుగోడు సభ బాధ్యతలు

భారీ జనసమీకరణకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతలో భాగంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ, జనసమీకరణ బాధ్యతలను సీఎం కేసీఆర్‌ పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్‌లకు అప్పగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా మునుగోడు మండలంలో 12 గ్రామాల బాధ్యతలు తీసుకున్నారు. ఇదే మండలంలో మరో 15 గ్రామాలకు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉంటారు. చౌటుప్పల్‌ పురపాలికకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, చౌటుప్పల్‌ మండలానికి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, మర్రిగూడ మండలానికి భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌ రెడ్డి, నాంపల్లి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చండూరు పురపాలికకు నకిరేకల్‌ ఎమ్మెల్యే లింగయ్య, చండూరు మండలానికి నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే భగత్‌, యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైౖర్మన్‌ సందీప్‌రెడ్డి, నారాయణపురం మండలానికి తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌, ఆలేరు ఎమ్మెల్యే సునీతలు ఇన్‌ఛార్జులుగా ఉంటారు. వీరంతా ముఖ్య కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు ప్రారంభించారు. సభకు భారీ జనసమీకరణ లక్ష్యంతో ప్రజలను కలవడమే కాకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని