రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబు అరెస్టు అక్రమమంటూ న్యాయస్థానం ఆయన

Published : 24 Sep 2022 05:52 IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబు అరెస్టు అక్రమమంటూ న్యాయస్థానం ఆయన రిమాండును తిరస్కరించడంపై సీఎం జగన్‌, రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలని శుక్రవారం ట్విటర్‌ వేదికగా డిమాండు చేశారు. ‘అక్రమ అరెస్టులకు సమాధానం చెప్పాల్సిన స్థితిని ఏపీ పోలీసు శాఖకు తీసుకొచ్చిందెవరు? తమ తప్పుడు వైఖరికి సీఐడీ సిగ్గుపడాలి’ అని చంద్రబాబు ట్వీట్‌లో ప్రశ్నించారు. సీఐడీ అధికారులకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను ట్వీట్‌కు జతచేశారు.

అరెస్టు దారుణం: వి.శ్రీనివాసరావు
ముందస్తు నోటీసులు లేకుండా అంకబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. చట్టవ్యతిరేక చర్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండు చేశారు.

* రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛ లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సలహా కమిటీ ఛైర్మన్‌ ఉప్పల లక్ష్మణ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని