ధాన్యం కొనుగోళ్లను రైతు సాయంగా చూపుతారా?

అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పిన సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్ల

Published : 25 Sep 2022 05:22 IST

సీఎంపై మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పిన సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్ల సొమ్మును రైతులకు చేసిన సాయంతో కలిపి వ్యవసాయానికి రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లను ఖర్చుగా చూపించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని ధ్వజమెత్తారు. మంగళగిరిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మూడున్నరేళ్ల వైకాపా పాలనలో రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం రూ.18,605 కోట్లే. ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రూ.1,612 కోట్లు వెచ్చించామని చూపించారు. నిబంధనల ప్రకారం ఈ సొమ్మును కేంద్రమే చెల్లిస్తుంది. వాటిని ఎందుకు తెచ్చుకోలేదు. బిందు సేద్యానికి రూ.1,264 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. ఆ పథకాన్ని ఆపేసి మూడేళ్లయింది. తెదేపా హయాంలో రైతు రథం కింద రెండేళ్లలో 23వేల ట్రాక్టర్లు ఇస్తే.. జగన్‌ ఇప్పటి వరకు 3,800 ట్రాక్టర్లే ఇచ్చారు. మెగా సీడ్‌ పార్కు ఏర్పాటు కోసం రూ.650 కోట్లు పెట్టుబడి పెడతామని విదేశీ కంపెనీలు వస్తే దానినీ నిలిపేశారు’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని