కేంద్ర అవార్డులపై వారిది అసత్య ప్రచారం

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌శాఖకు కేంద్రం అవార్డులు ఇస్తుంటే, రాష్ట్ర భాజపా నాయకులు తప్పుడు లేఖలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.

Updated : 04 Oct 2022 06:27 IST

భాజపా రాష్ట్ర నేతలపై మంత్రి ఎర్రబెల్లి ధ్వజం

పురస్కార కారకులకు సత్కారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీరాజ్‌శాఖకు కేంద్రం అవార్డులు ఇస్తుంటే, రాష్ట్ర భాజపా నాయకులు తప్పుడు లేఖలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ దేశంలోనే నం.1 అని, ఇక్కడి అభివృద్ధి పనులను అధ్యయనం చేయాలని అధికారులను కేంద్రం ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. మిషన్‌ భగీరథ పథకానికి, పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్ర పురస్కారాలు లభించడానికి కృషిచేసిన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ హన్మంతరావు, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తదితర అధికారులను సోమవారమిక్కడ సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..‘కేంద్ర అవార్డులు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తూ ఎన్నో పురస్కారాలు సాధించింది. మిషన్‌ భగీరథను కేంద్రం కాపీ కొట్టింది. తెలంగాణలో 100 శాతం గృహాలకు తాగునీరు సరఫరా అవుతోందని, జల్‌జీవన్‌శాఖ ట్విటర్‌, అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ పథకానికి కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. మరోవైపు పల్లెప్రగతికి కేంద్రం నిధుల్ని రూ.350కోట్ల నుంచి రూ.230కోట్లకు తగ్గించింది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని