బీసీ కులగణన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: కేకే

బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంటులో పోరాడుతామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. బీసీ జనగణన కోసం ఇప్పటికే

Published : 29 Nov 2021 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంటులో పోరాడుతామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. బీసీ జనగణన కోసం ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశామని, దాన్ని సాధించేంత వరకు పార్టీ విశ్రమించబోదని స్పష్టంచేశారు. బీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబరు 13, 14, 15 తేదీల్లో దిల్లీలో బీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలకు తెరాస సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో పలువురు నేతలు కేకేను ఆదివారం ఆయన నివాసంలో కలసి.. బీసీ గణన సాధించేందుకు కృషిచేయాలని అభ్యర్థించారు. దేశంలోని అన్ని బీసీ సంఘాల ప్రతినిధులు ‘జంగ్‌ సైరన్‌’ పేరుతో దిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారని, అందులో పాల్గొనాలని కేకేను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘బీసీల చలో దిల్లీ’ కరపత్రాన్ని విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని