Gummanur Jayaram: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్‌

గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)ను మంత్రి వర్గం నుంచి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్ చేశారు. 

Updated : 05 Mar 2024 20:29 IST

అమరావతి: గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram)ను మంత్రి వర్గం నుంచి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్ చేశారు. ఈమేరకు రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గుమ్మనూరు మంగళవారం ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ అడిగారు. నాకు ఇష్టం లేదు. తెదేపా తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు’’ అని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా ఆయన తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని