Telangana News: నా వెనక భాజపా ఉందనే విమర్శలు అర్థరహితం: కేఏ పాల్‌

కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హెచ్చరించారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దారి తప్పిందన్నారు..

Published : 18 May 2022 01:44 IST

హైదరాబాద్: కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హెచ్చరించారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దారి తప్పిందన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి భాజపా అంటే భయమని.. దేశంలోని మిగిలిన అన్నీ పార్టీలు భాజపా అనుబంధ పార్టీలేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఎవరెవరో దోచుకునే వాళ్లకు అధికారం ఇచ్చారని.. ప్రజలకు సేవ చేసేందుకు ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన వెనుక భాజపా ఉందనే విమర్శలు అర్థరహితమైనవని.. అవి కొంతమంది పనిలేని వాళ్లు చేసే విమర్శలు అని ఆయన కొట్టిపారేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోడానికి తెరాస ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని