Kadiyam Kavya: భారాసకు షాక్‌.. వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య

వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.

Updated : 28 Mar 2024 23:29 IST

హైదరాబాద్‌: వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను  వరంగల్‌ బరి నుంచి తప్పుకొంటున్నట్టు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. భారాస నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘‘ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కామ్‌ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయి. ఎవరికి వారే అన్నట్టు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అధినేత కేసీఆర్‌, కార్యకర్తలు నన్ను మన్నించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి..

ఒకటి రెండు రోజుల్లో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికపై కడియం శ్రీహరి ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో సంప్రతింపులు జరిపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని